

We are a voluntary driven network of people and organisations working for farmers in Telangana and Andhra Pradesh
Donate NowUrgent for those interested in tackling glyphosate a pesticide for which more than $10 billion dollars of settlement have been done by Bayer with people in US suffering from cancer after exposure to glyphosate and whose illegal supply and use takes place on large scale in India ; a draft on restricting use of glyphosate has been published by Union Govt Ministry of Agriculture and Farmers Welfare. Couple of days remain to send suggestions..please do, pesticide industry is likely to send objections in strong numbers too.
Act Now!గ్రామీణ ,ఆదివాసీ ప్రాంతాల ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేయడం. ప్రజల ఆకాంక్షలకు, హక్కులకు అనుగుణంగా నిర్ధిష్ట డిమాండ్లు రూపొందించడం. డిమాండ్ల సాధనకు ప్రజల భాగస్వామ్యంతో స్వతంత్ర్య కార్యాచరణ చేపట్టడం.
భావ సారూప్యత కలిగిన, ఉమ్మడి నిర్ణయాలకు కట్టుబడి ఉండే సంఘాలతో కలసి లక్ష్యాల సాధనకు స్థానిక, జాతీయ స్థాయిలో ఐక్య కార్యాచరణ చేపట్టడం.
అంతర్జాతీయంగా ఆర్ధిక, రాజకీయ రంగాలలో వస్తున్న మార్పులు, భారత దేశ గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజలపై, పర్యావరణంపై వాటి ప్రభావం గురించి నిరంతర అధ్యయనంతో సంస్థ అవగాహనను మెరుగు పరుచుకోవడం, దానికి అనుగుణంగా కార్యాచరణలో మార్పులు చేసుకోవడం.
దేశ ప్రజలను దోపిడీ చేసే, వివక్ష చూపే అన్ని రకాల ఆర్ధిక,రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై సంస్థ వైఖరిని స్పష్టంగా వెల్లడించడం. వాటికి వ్యతిరేకంగా సాగే ప్రజాస్వామిక ఉద్యమాలలో క్రియాశీలంగా భాగం అవ్వడం. పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కుల కోసం రాజీ లేని కృషి కొనసాగించడం.