Field visit – Dayyambanda Tanda

50 కుటుంబాలు ఉండే ఒక తండా ఈ నాలుగేళ్లలో మద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసిందంటే నమ్మగలరా ?
రెండు రోజుల క్రిందట హైదరాబాద్ నుండి కొంతమంది యువకులు గ్రామాలలోనివ్యవసాయం, పాడి పంటలు ,విద్యా,ఉపాది తదితర విషయాల గురించి మాట్లాడి ఆ గ్రామంలో ఏదైనా ఒక కార్యక్రమము తీసుకుందామని భువనగిరి జిల్లాలోని ఒక తండాకు వెళ్ళాము. ఆ తండా వాసులతో పంటల గురించి మాట్లాడితే ఆహార ధాన్యాలు అందులో ఎక్కువగా చిరు ధాన్యాలు పండిస్తామనితెలిపారు. పత్తి పంట పెడితే అప్పులు ఎక్కువగా అవుతున్నాయని అందువల్ల చిరు ధాన్యాలు వేస్తామని తెలిపారు. గ్రామంలో పంటల వేసే సమయంలో విత్తనాలు ఇచ్చి పుచ్చుకోవటానికి గ్రామంలో సీడ్ బ్యాంకు కుడా ఉంది.మిగిలిన తండాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం నయం,ప్రతి కుటుంబానికి ఎంతోకొంత భూమి ఉంది. చదువుకోవలసిన పిల్లలు అందరూ చదువుకుంటున్నారు అందరూ రెండు అంతకంటే ఎక్కువ బోర్లకు ప్రయత్నించారు .కొందరికి నీళ్ళు పడ్డాయి .కొందరికి నీళ్ళు పడక అప్పులు మిగిలాయి . ఇక వీరికి వ్యవసాయంలో నష్టం వస్తే ఆ నష్టం వ్యాపారం లో కవర్ చేసుకుంటారు. (తండాలో అందరూ సీజనల్ బిజినెస్ చేస్తారు)
సరే పరవాలేదు అంత బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో గ్రామస్థులతో మాట్లాడుతున్న మా మిత్రుడు నవీన్
సాయంత్రం 6 గంటల సమయంలో దూరంగా కనిపిస్తున్న ఖాళీ మద్యం సీసాలను చూస్తూ మద్యపానం గురించి మాట్లాడటం ప్రారంభించాడు.నిజంగా ఆ వాస్తవాలు వింటే నివ్వెర పోవాల్సిందే. ఒక కుటుంబం సగటున నెలకు 5 వేల రూపాయలు మద్యానికి ఖర్చు చేస్తున్నారు. అంటే ఈ నాలుగేళ్లలో ఒక కుటుంబానికి మద్యానికి అయిన ఖర్చు 2 లక్షల 40 వేలు . డబ్బు వృదా ఖర్చే కాదు తాగినప్పుడు కొట్లాటలు. 50 కుటుంబాలు ఉన్న ఆ తండా వాసులు ఈ నాలుగేళ్లలో మద్యానికి తక్కువలో తక్కువ కోటి
రూపాయలు ఖర్చు చేసారంటే,నిజంగా ఆ ఖర్చే లేకపోతే ఎంత ఆర్థిక పరిపుష్టి వచ్చేది. సరే ఇప్పటికైనా మద్యం నుండి దురమవుతరా అని గ్రామస్తులను అడిగినప్పుడు గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పారు. నిజంగా మద్యానికి దూరమైతే అదొక ఆదర్శ తండా చూడటానికి మనమందరం వెళ్ళిరావచ్చు . వేచిచూద్దాం.