Field Report – Manchiryal District

మంచిర్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి,సరే అది మామూలే, కానీ కౌలు రైతుల కడుపులు అంతకంటే ఎక్కువ మండుతున్నాయి. నాలుగు రోజులపాటు జిల్లాలో 15 రైతు ఆత్మహత్యల కుటుంబాలను కలువగా అందరూ కౌలు రైతులే లక్సెట్టీ పేట, దంత పల్లి గ్రామాలలో 100 మంది కౌలు రైతుల వివరాలు తీసుకున్నాము.కౌలుకు ఇచ్చిన వారందరూ నాలుగు ప్రధాన కారణాలలో కౌలుకు ఇస్తున్నారు.1. సింగరేణి లో ఉద్యోగాలు చేయటం,2. లక్సెట్టి పేట లేదా మంచిర్యాల లో స్థిరపడి ఫైనాన్స్ వ్యాపారాలు,లేదా చిన్న ఉద్యోగాలు,3. పిల్లల చదువుల కోసం సమీప పట్టణాలు చేరిన వారు.4.భూమి ఉన్న వారు వృద్ధాప్యం రావటం, చిన్న చిన్న వ్యాపారాలు, పౌరోహిత్యం, వాహనాల యజమానులు, తదితర కారణాలతో వారు కౌలుకు ఇస్తున్నారు.వారు ఎప్పుడూ వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా నమ్ముకున్న వాళ్ళు కాదు. దీనిలో కొంతమంది చాలా సంవత్సరాల తర్వాత రైతు బందు చెక్కులు తీసుకోవటానికి గ్రామానికి వచ్చారు.ఇక కౌలుకు తీసుకునే వ్యక్తులు గత దశాబ్ద కాలానికి పైగా 2000 మొదలు ఇప్పుడు 10 నుండి 12 వేలు కౌలు చెల్లిస్తున్నారు. సరే ఇక నేరుగా సింగరేణి కార్మికుల దగ్గరికే వద్దాము(మేము వెళ్ళిన గ్రామం సింగరేణికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి). ఉదాహరణకు సింగరేణి కాలరీస్ లో ఉద్యోగం చేస్తున్న వారు జీతం+కౌలు+రైతు బందు ఇలా మూడు విధాలుగా లబ్ది పొందుతున్నారు మాకు మాత్రం నోట్లో మట్టి కొట్టారు అంటూ కౌలు రైతులు పడుతున్న భాధ. చెప్పటానికి సాధ్యం కావటం లేదు.
ప్రతి కౌలు రైతుకు సగటున 2 లక్షల అప్పు. నిజంగా భూమిని, వ్యవసాయాన్ని నమ్ముకున్న కౌలు రైతులకు రైతు బందు వర్తించనందుకు అందరం సిగ్గుపడాలి.